కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు ఉండవన్నారు భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్ తెలిపారు.అన్ని పార్టీలను సమానంగా చూస్తామన్నారు. బీహార్ లో ఓటరు జాబితాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఈసీ ఆక్షేపించారు. రాజ్యాంగ సంస్థలను అవమానించడం సరి కాదని..ఓటరు జాబితాను బూత్ లెవల్లోనే ప్రతి పార్టీ చూసుకుంటుందని తెలిపారు. సంస్కరణల్లో భాగంగానే ఓటరు జాబితాను సవరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు.
రాజకీయాల్లో వివాదాలు అనేవి సర్వసాధారణం. కానీ నేడు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ గాంధీ భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఓట్ చోరీ జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్నికల సంఘం రాహుల్ గాంధీపై మండిపడింది. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని ఈసీ ఫైర్ అయ్యింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎన్నికల సంస్థ స్వతంత్ర , పారదర్శకతపై ప్రజలు విశ్వాసాన్ని దెబ్బతీసే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం పౌరులు స్వచ్చందంగా ఓటు వేయవచ్చని తెలిపారు.
లోకసభ ఎన్నికల్లో లక్షలాది మంది పోలింగ్ ఏజెంట్లు, ఉద్యోగులు తమ విధులు సమర్థంగా నిర్వహించారని ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ వెల్లడించారు. ఇలాంటి ఆరోపణలపై ఈసీ భయపడదన్నారు. ఎవరి పేర్లయినా గల్లంతయినా పేరు, అడ్రస్ తప్పుడు నమోదైనా ఎన్నికల అధికారుల ద్రుష్టికి తీసుకురావచ్చని చెప్పారు. ఓటు చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుందన్నారు. ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఓట్లు వేసేందుకు వచ్చే వాళ్ల వివరాలను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారని తెలిపారు.
VIDEO | In a press conference, the Chief Election Commissioner Gyanesh Kumar says, “The Election Commission wants to give a message to the voters. According to the Indian Constitution, persons completing 18 years should be a voter. You know that according to law, every political… pic.twitter.com/HeMJu4mBtV
— Press Trust of India (@PTI_News) August 17, 2025


