ఈత పోటీలకు స్వరణ్, భువన్ ఎంపిక
కాకతీయ, కరీంనగర్ : ఈనెల 27 నుంచి 29 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల స్విమ్మింగ్ పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కంకణాల స్వరణ్ ఎంపికయ్యారు. ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గ్రూప్–1, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో సిల్వర్ మెడల్ సాధించడంతో ఆయనకు సౌత్ జోన్ అవకాశం దక్కింది. అలాగే వాటర్ పోలో జట్టుకు భువన్ ఎంపిక కావడం విశేషం. స్వరణ్, భువన్‌లను జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి, డీవైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, కోచ్లు అభినందించారు.


