నల్లబెల్లి మండలంలో క్రిస్మస్ వేడుకలు
కాకతీయ ,నల్లబెల్లి : నల్లబెల్లి గ్రామం, మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేపట్టి, అనంతరం క్రిస్మస్ విందు ఏర్పాటు చేశారు. వేడుకల్లో వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు పంచుకున్నారు. క్రిస్మస్ వంటి పండుగలు సామాజిక ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో కృష్ణ, ఎంపీడీవో శుభ నివాస్ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.


