ప్రపంచానికి క్రిస్మస్ గొప్ప పండుగ
శాంతి, ప్రేమ, సోదరభావమే సందేశం: ఎమ్మెల్యే విజయరమణ రావు
కాకతీయ, పెద్దపల్లి : క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి, ప్రేమ, సోదరభావం సందేశాన్ని ఇస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ క్రైస్తవుల కోసం నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలు ఎమ్మెల్యేకు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రార్థనలు చేసి ఆశీర్వాదం అందించారు. విజయరమణ రావు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పండుగను మత సామరస్యంతో కలిసి జరుపుకోవడమే తెలంగాణ ప్రత్యేకత అన్నారు. క్రిస్టియన్ మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, క్రైస్తవ మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


