ఇండిగోపై నరేష్ ఆగ్రహం
బస్సుల్లో ప్రయాణికుల్ని కుక్కేశారంటూ ట్వీట్
కాకతీయ, సినిమా : ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవలపై టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం ఎక్కేందుకు ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించారని ఆరోపించారు. ఈ కారణంగా తీవ్ర అసౌకర్యం కలిగిందని తెలిపారు. ఈ విషయమై ఇండిగో సిబ్బందితో వాగ్వాదం జరిగినప్పటికీ స్పందన లేకపోవడంతో అక్కడి పరిస్థితులను ఫొటోలతో సహా ట్వీట్ చేశారు. బస్సులు ‘టార్చర్ ఛాంబర్‌లా’ మారాయని, సీనియర్ సిటిజన్లను కూడా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. బస్సుల్లో ఓవర్‌లోడింగ్ ఆపాలని, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ అంశంపై చట్టపరంగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు నరేష్ వెల్లడించారు


