epaper
Monday, March 2, 2026
epaper

హెచ్‌–1బీపై ట్రంప్ బిగ్ బాంబ్!

హెచ్‌–1బీపై ట్రంప్ బిగ్ బాంబ్!
లాటరీకి చెక్‌… అధిక వేతనాలకే ప్రాధాన్యం
లాటరీ విధానానికి ముగింపు – ‘వెయిటెడ్ సెలక్షన్’ అమలు
2026 ఫిబ్రవరి 27 నుంచి కొత్త నిబంధనలు
అధిక నైపుణ్యం, ఎక్కువ జీతాల ఆధారంగా వీసాల కేటాయింపు
భారతీయ యువత అమెరికా డ్రీమ్‌కు కొత్త అడ్డంకులు

కాకతీయ, నేషనల్ డెస్క్ : అమెరికాలో ఉద్యోగం సాధించాలనే విదేశీ నిపుణుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది ట్రంప్ ప్రభుత్వం. హెచ్‌–1బీ వర్క్ వీసా విధానాన్ని పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి, నైపుణ్యం, వేతన స్థాయి ఆధారంగా వీసాలు కేటాయించే ‘వెయిటెడ్ సెలక్షన్’ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్‌–1బీ రిజిస్ట్రేషన్ సీజన్ నుంచే ఈ మార్పులు వర్తిస్తాయి. ప్రతి ఏడాది జారీ అయ్యే సుమారు 85 వేల హెచ్‌–1బీ వీసాల కేటాయింపుపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.

లాటరీ దుర్వినియోగంపై ఆరోపణలు
లాటరీ విధానం కారణంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకూ హెచ్‌–1బీ వీసాలు దక్కుతున్నాయని, కొంతమంది యజమానులు తక్కువ వేతనాలకు విదేశీ కార్మికులను తీసుకొచ్చేందుకు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని యూఎస్‌సీఐఎస్ ఆరోపిస్తోంది. అందుకే ఇకపై అధిక వేతనాలు చెల్లించే, ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

భారతీయులపై ప్రభావం
అమెరికాలో హెచ్‌–1బీ వీసాల ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారిలో భారతీయులే అత్యధికం. టెక్ నిపుణులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, వైద్యులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే కెరీర్ ప్రారంభ దశలో తక్కువ ప్యాకేజీలతో అమెరికాలో అడుగుపెట్టే అవకాశాలు ఈ కొత్త విధానంతో మరింత తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా టెక్ కంపెనీలు మాత్రం ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హెచ్‌–1బీ వీసాలు ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధికి కీలకమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ఆకర్షించకపోతే అమెరికా తన ఆధిక్యతను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు విమర్శకులు మాత్రం స్థానిక ఉద్యోగాలకు రక్షణ అవసరమని వాదిస్తున్నారు. మొత్తానికి హెచ్‌–1బీపై ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా ఉద్యోగ విపణిలోనే కాదు, వేలాది భారతీయ యువత అమెరికా డ్రీమ్‌పై కూడా పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగుల్చుతోంది.



 

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img