క్రీడల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
కాకతీయ, తొర్రూరు: ఈనెల 19 నుంచి 21 వరకు వరంగల్ గర్ల్స్–2 తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన మూడో జోష్ పూర్వ వరంగల్ జిల్లా స్థాయి క్రీడల్లో తొర్రూరు గర్ల్స్–1 తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ పి. వనజ తెలిపారు. అండర్–14 విభాగంలో మొత్తం ఛాంపియన్‌గా నిలవగా, వాలీబాల్‌లో అండర్–14, ఖోఖోలో అండర్–17, అండర్–19, చెస్‌లో అండర్–14, అండర్–17 విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఖోఖో అండర్–14, కబడ్డీ అండర్–14, అండర్–17 విభాగాల్లో రన్నర్‌లుగా నిలిచారు. అథ్లెటిక్స్‌లో 25 బంగారు పతకాలతో పాటు వెండి, కాంస్య పతకాలు సాధించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కూడా విద్యార్థులు ప్రతిభ చూపుతున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న పీఈటీలు కళ్యాణి, ఉమలను అభినందించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపాధ్యాయ బృందం, బోధనేతర సిబ్బంది అభినందించారు.


