అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్
కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన వివాహితపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఇనుగుర్తి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై గంగారపు కరుణాకర్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అదే గ్రామంలోని రైస్ మిల్లులో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన కార్మికుడు అంకల్ మాంజి సోమవారం మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు.


