epaper
Monday, March 2, 2026
epaper

రూ. 1000 తగ్గించారు

రూ. 1000 తగ్గించారు
ఇసుక ర్యాంపుల్లో అక్రమ వసూళ్లలో కొత్త లెక్క‌లు
కాకతీయ వరుస కథనాలతో ఇసుకాసురుల్లో అలజడి
రూ. 5600 నుంచి రూ. 4500కు మార్పు
చర్యలకు, తనిఖీలకు మంగళం పాడిన టీజీఏండీసీ
వంత పాడటంలో ఆంతర్యం ఏమిటి

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా పరిధిలోని ఇసుక ర్యాంపుల్లో అక్రమ వసూళ్లు రూపం మార్చుకున్నాయే తప్ప ఆగలేదు. ‘మీ కోసమే వెయ్యి రూపాయలు తగ్గించాం’ అంటూ కాంట్రాక్టర్లు లారీ డ్రైవర్లను మభ్యపెడుతూ కొత్త వసూళ్ల పద్ధతిని అమలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకతీయ వరుస కథనాలతో ఏర్పడిన ఒత్తిడికి తాత్కాలికంగా వసూళ్ల మొత్తాన్ని తగ్గించినా, అసలు అక్రమ వ్యవస్థ మాత్రం యథాతథంగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఒక్కో లారీపై రూ.5600 వరకు వసూలు చేసిన నిర్వాహకులు ఇప్పుడు మొత్తం రూ.4500కు పరిమితం చేశారు. లోడింగ్ పేరుతో రూ.2500, పట్టా (పర్దా) పేరుతో రూ.1500, జేసీబీకి రూ.200, ఇసుక లెవలింగ్‌కు రూ.300 వసూలు చేస్తున్నట్లు లారీ డ్రైవర్లు చెబుతున్నారు. ర్యాంపులో అడుగుపెట్టినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ఏదో ఒక పేరుతో డబ్బులు చెల్లించకపోతే లోడింగ్ జరగదన్న పరిస్థితి కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టా పేరుతో వసూలు… కప్పడం మాత్రం లేదు!

అక్రమ వసూళ్లలో మరో కొత్త మాయ బయటపడింది. పట్టా పేరుతో రూ.1500 వసూలు చేస్తున్నప్పటికీ లారీలపై ఇసుక కప్పకుండా ర్యాంపుల నుంచి పంపిస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. దీని వల్ల రహదారులపై ఇసుక చల్లరేగి ప్రమాదాలకు దారి తీస్తోందని, వెనుక వస్తున్న వాహనదారులతో వాగ్వాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. డబ్బులు తీసుకుంటే సేవ ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నలకు నిర్వాహకుల వద్ద సమాధానం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాలపై కాకతీయ వరుస కథనాలు ప్రచురించడంతో నిర్వాహకుల్లో కలకలం మొదలైంది. ఈ కథనాల ప్రభావంతోనే వసూళ్ల మొత్తాన్ని తాత్కాలికంగా తగ్గించినట్లు డ్రైవర్లే చెబుతున్నారు. “వార్తలు వచ్చాయి కాబట్టే ఇప్పుడు తగ్గించారు… మళ్లీ కొద్ది రోజుల్లో పెంచుతారు” అంటూ ఒక లారీ డ్రైవర్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ అక్రమ వసూళ్లు టీజీఏండీసీ సిబ్బంది ముందే జరుగుతున్నాయా? అన్న ప్రశ్నకు “అందరికీ తెలిసే జరుగుతోంది” అని డ్రైవర్లు చెప్పడం మరింత సంచలనంగా మారింది.

చర్యలకు దూరంగా టీజీఏండీసీ?

ఇసుక ర్యాంపుల్లో బహిరంగంగా డబ్బులు వసూలవుతున్నా టీజీఏండీసీ అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తనిఖీలు, కఠిన చర్యలు తీసుకోవాల్సిన శాఖ పూర్తిగా మౌనం వహిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ వసూళ్ల మొత్తాన్ని మార్చడమే చర్యలుగా భావిస్తున్నారా? లేక కాంట్రాక్టర్లకు మౌన మద్దతు ఇస్తున్నారా? అన్న ప్రశ్నలు లారీ డ్రైవర్లలో ఉత్పన్నమవుతున్నాయి. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై వివరణ కోరేందుకు కాకతీయ టీజీఏండీసీ పీఓను పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img