మహిళలకు ఉచితంగా కారు డ్రైవింగ్ శిక్షణ
బీసీ మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యం
సుందర్ రాజ్ యాదవ్, ఓబీసీ చైర్మన్
కాకతీయ, హనుమకొండ : బీసీ మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఓబీసీ హనుమకొండ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మహిళా కారు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆసక్తి గల బీసీ మహిళలు తల్లిదండ్రుల సమ్మతితో నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసి రాంనగర్‌లోని ఓబీసీ కార్యాలయానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. గతంలో బీసీ బాలికల వసతి గృహాల్లో నిర్వహించిన ఆరోగ్య శిబిరాలు విజయవంతమైనట్లే ఈ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్ సహకరిస్తున్నట్లు తెలిపారు.


