కాకతీయ, తెలంగాణ బ్యూరో: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెకస్ 2, నారాయణ గిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రింగురోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. వీరికి సుమారు 24 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలు, తాగునీటిని కూడా పంపిణీ చేస్తున్నారు.
శ్రీవారి 87,759 మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం 42,043 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లుగా ఉన్నట్లు టీటీడీ తెలిపింది.


