అలుగునూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు
కాకతీయ, కరీంనగర్ : వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు తెల్లవారుజామున అలుగునూర్ చౌరస్తా వద్ద రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సు ముందుభాగం స్వల్పంగా దెబ్బతినగా, ఘటన కారణంగా కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం


