epaper
Thursday, January 15, 2026
epaper

కేసీఆర్‌ది అంతా నటనే..

కేసీఆర్‌ది అంతా నటనే..
బ‌ల‌హీన‌మైన బీఆర్ఎస్‌ను కాపాడుకునే తాప‌త్ర‌యం
కొడుకు, అల్లుడు వల్ల పార్టీ మ‌రింత దిగజారుతోంది
నీళ్ల విషయంలో ఆయ‌న అనేక తప్పిదాలు చేశారు
బీజేపీ ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారు
యూరియా కొరతకు కేంద్రమే కారణం : మంత్రి జూపల్లి కృష్ణారావు
తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది : మంత్రి పొన్నం ప్ర‌భాకర్‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ బలహీనమైందని కేసీఆర్‌కు స్పష్టంగా అర్థమైందని, పార్టీని కాపాడుకోవాలనే తాపత్రయంతోనే ఆయన మళ్లీ బయటకు వచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కొడుకు, అల్లుడు కారణంగానే బీఆర్ఎస్ మరింత దిగజారుతోందన్న విషయం కేసీఆర్‌కే అర్థమైందన్నారు. పాలమూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదనడం పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్ ముందు చెప్పే మాటలకు, వెనక చేసే పనులకు పొంతన ఉండదని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఇరిగేషన్ కోసం కాదని, తాగునీటి కోసమేనని సుప్రీంకోర్టులో కేసీఆర్ ప్రభుత్వమే అఫిడవిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. నీళ్ల విషయంలో కేసీఆర్ అనేక తప్పిదాలు చేశారని, తెలంగాణ నీటి హక్కులను పూర్తిగా వినియోగించుకోవడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు.

బీజేపీ ప్రతి అడుగులోనూ బీఆర్ఎస్‌కు తోడుగా నిలిచిందని జూపల్లి ఆరోపించారు. జగన్ దగ్గరకు వెళ్లి రాయలసీమను ‘రత్నాల సీమ’గా చేస్తానని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. కానీ తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులు సాధించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టులపై ఇప్పుడు ప్రేమ చూపించడం అంతా రాజకీయ నటనేనని ఎద్దేవా చేశారు. యూరియాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ… యూరియా కొరతకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. సరఫరా తగ్గితే డిమాండ్ పెరగడం సహజమని, ఉన్న యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలని కోరడం తప్పా? అని ప్రశ్నించారు. రైతులు లైన్లలో నిలబడడం చూడలేకే ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకొస్తున్నామని తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఎందుకు పూర్తిస్థాయిలో తెరిపించలేకపోయారని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

ఇప్పటికే మీ తోలు ప్రజలే తీశారు

ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పార్లమెంట్, ఎమ్మెల్సీ, ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్‌కు తగిన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. శాసనసభకు రావాలని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ప్రతిపక్షం ఎందుకు దూరంగా ఉందని ప్రశ్నించారు. మీరు హాస్టల్ అద్దెలు పెండింగ్ పెడితే కాంగ్రెస్ చెల్లించిందని, గోదాముల్లో స్కూళ్లు నడిపితే ఇప్పుడు సొంత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. మా మీద ఆరోపణలు ఉంటే సభలో చర్చించాలన్నారు. కేసీఆర్‌పై ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా తమకు గౌరవం ఉందని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఉద్యోగాల హామీలపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని, ప్రజల తరఫున గట్టిగా పోరాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img