epaper
Monday, March 2, 2026
epaper

గ్రామాభివృద్ధే లక్ష్యం కావాలి

గ్రామాభివృద్ధే లక్ష్యం కావాలి
పారదర్శక పాలనతో ప్రజల నమ్మకం నిలబెట్టాలి
గ్రామాలకు మౌలిక వసతుల్లో పూర్తి సహకారం
కాంగ్రెస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకే అందాలి
ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి
కొత్త సర్పంచ్‌లకు ఎమ్మెల్యే గండ్ర సూచనలు

కాకతీయ, గణపురం : గ్రామ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు నిత్యం ప్రజలతో మమేకమై పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. సోమవారం గణపురం మండలంలోని బుద్దారం, గణపురం, చెల్పూర్ గ్రామాల్లో ఎన్నికైన సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ కూడా పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో తమను ఎన్నుకున్నారని, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా పాలన సాగించాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు ప్రజల విశ్వాసమే అసలైన బలమని, అదే అభివృద్ధికి పునాదిగా మారుతుందని అన్నారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

గ్రామాల అభివృద్ధికి అవసరమైన తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతుల కల్పనలో ప్రజా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందేలా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని నూతన పాలకవర్గాలకు సూచించారు. పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనతోనే ప్రజాప్రతినిధులకు శాశ్వత గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో ఎలాంటి అవినీతికి తావులేకుండా, అందరినీ కలుపుకొని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో ఐక్యత, సామాజిక సమతుల్యతను కాపాడటం పాలకవర్గాల ప్రధాన బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా నూతన సర్పంచ్‌లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో పేదలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, యువతకు ప్రభుత్వ పథకాల ద్వారా మేలు జరిగేలా పనిచేయాలని అన్నారు. కార్యక్రమం అనంతరం గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img