సర్పంచ్ సహేంద్ర భిక్షపతికి ఘన సన్మానం
రాయపర్తిలో నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు
యువత ఆధ్వర్యంలో గజమాలలతో ఘన స్వాగతం
గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరం
కాకతీయ, రాయపర్తి : రాయపర్తి గ్రామ నూతన సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గారే సహేంద్ర బిక్షపతికి గ్రామ యువత సోమవారం ఘనంగా సన్మానం నిర్వహించారు. గజమాలతో స్వాగతం పలుకుతూ, నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రత్యేక అధికారి గుగులోత్ కిషన్, పంచాయతీ కార్యదర్శి వల్లె వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్‌గా సహేంద్ర బిక్షపతి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.
మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
గ్రామంలో మెరుగైన రహదారులు, తాగునీటి సదుపాయం, విద్య, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తానని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆమె కోరారు. యువత చురుకైన పాత్ర పోషిస్తే గ్రామ అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు కళ్యాణ్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఎండీ మహమూద్, కుంట రమేష్, మైనార్టీ అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, మహమ్మద్ గౌస్, రియాజ్, షఖిల్, మచ్చ శ్రీనివాస్, హుస్సేన్, పెండ్యాల గణేష్, వసీం, పవన్ తదితరులు పాల్గొని నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


