చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు
టిడిపి పరకాల నియోజకవర్గ బాధ్యులు కందుకూరి నరేష్
కాకతీయ, ఆత్మకూరు : మాజీ సీఎం కేసీఆర్‌కు చంద్రబాబు నాయుడిని విమర్శించే నైతిక హక్కు లేదని టిడిపి పరకాల నియోజకవర్గ బాధ్యులు కందుకూరి నరేష్ అన్నారు. సోమవారం ఆత్మకూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలపై ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని వేదికగా చేసుకుని కుటుంబానికి పదవులు కట్టబెట్టుకున్నారని అన్నారు. ముందుగా తన పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.


