పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
నూతన పాలకవర్గాలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి పిలుపు
కాకతీయ, కరీంనగర్ : గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలకు పిలుపునిచ్చారు. తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకుని సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్న పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పోలీస్ శాఖ సహకారంతో చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


