ఉపాధి హామీపై కేంద్రం కత్తి
పేదల హక్కుల నిర్వీర్యానికి కుట్ర
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్
కాకతీయ, కరీంనగర్ : గ్రామీణ పేదలకు ఏడాదికి వంద రోజుల ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి యత్నిస్తోందని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ ఆరోపించారు. ఈ చట్టం కోట్లాది పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని, దాన్ని బలహీనపర్చే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, 40 శాతం నిధుల భారాన్ని రాష్ట్రాలపై మోపడం, బయోమెట్రిక్ వంటి నిబంధనలతో కూలీలకు అన్యాయం జరుగుతోందన్నారు. పేదల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.


