epaper
Thursday, January 15, 2026
epaper

ఆనంద్‌పై ఆరా!

ఆనంద్‌పై ఆరా!
సీ-సెక్షన్‌లో ఏడేళ్లుగా విధులు
ప్ర‌జావాని నుంచి సీడీఎంఏకు లేఖ..
ప్రజావాణిలో ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
బల్దియా అధికారుల‌ను వివ‌ర‌ణ కోరిన సీడీఎంఏ
సీ-సెక్షన్ ఉద్యోగికి మెమో జారీ

కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సీ-సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆనంద్ వ్యవహారం ప్రస్తుతం బల్దియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌లో చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు, ఉద్యోగుల బదిలీల్లో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా పాలకవర్గంలో ఓ బడా నేత అండతో ఆనంద్ తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సీ-సెక్షన్‌లో సూపరింటెండెంట్‌గా ఏడేళ్లుగా పనిచేస్తున్నాడన్న అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. అదే సమయంలో సీ-1 సెక్షన్‌కు కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.

ఒకే సెక్షన్‌లోనే ఏళ్ల తరబడి!

ఒకే సెక్షన్‌లో సుదీర్ఘకాలం పనిచేయడంతో ఉన్నతాధికారులు, పాలకవర్గంలో పలుకుబడి పెంచుకుని ‘తాను చెప్పిందే వేదం’ అన్నట్లు వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతర్గత బదిలీల్లో సైతం అర్హత లేని వారిని ఆర్‌ఐలుగా నియమించడంలో చక్రం తిప్పినట్లు బల్దియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాలపరిమితి ముగిసిన ఉద్యోగులను పక్కన పెట్టి, తనకు అనుకూలంగా ఉండేవారికే బదిలీలు కల్పించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పలువురు సీనియర్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే చోట మూడేళ్లకు మించి పని చేయరాదన్న నిబంధన ఉన్నప్పటికీ, ఆనంద్ ఏడేళ్లుగా అదే సెక్షన్‌లో కొనసాగుతున్నాడంటూ కొందరు ఉద్యోగులు ఇటీవల ప్రజాభవన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు ప్రజావాణి నుంచి సీడీఎంఏకు లేఖ వెళ్లగా, ఆనంద్ వ్యవహారంపై వివరణ కోరుతూ జీడబ్ల్యూఎంసీకి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.

ఆనంద్‌కు మెమో జారీ

దీంతో బల్దియా ఉన్నతాధికారులు ఆనంద్‌కు మెమో జారీ చేశారు. ప్రస్తుతం ఆనంద్ వివరణ తయారీలో నిమగ్నమైనట్లు, ఆ వివరణను మరో ఉద్యోగితో సిద్ధం చేయిస్తున్నట్లు కార్యాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, తాను సీ-సెక్షన్‌లో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలే పని చేశానని, ఏడేళ్లు అవాస్తవమని తన వివరణలో పేర్కొంటున్నట్లు సమాచారం. అయితే, మూడేళ్లకే బదిలీ చేయాల్సిందే కదా అన్న ప్రశ్న బల్దియాలో మళ్లీ తెరపైకి వచ్చింది. ఆనంద్‌పై వస్తున్న మరో ప్రధాన ఆరోపణ ఏమిటంటే… తన బావమరిది బదిలీని అడ్డుకోవడంలో శాయశక్తులా ప్రయత్నించడమే. పరకాల మున్సిపాలిటీ నుంచి వరంగల్‌కు డిప్యుటేషన్‌పై వచ్చిన 31 మంది పీహెచ్ వర్కర్లను తిరిగి పంపించాలని ఎమ్మెల్యే ఆదేశాల నేపథ్యంలో కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో 30 మంది తిరిగి వెళ్లినా, ఒకరు మాత్రం ఇప్పటికీ వరంగల్‌లోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఒక్కరు ఆనంద్ బావమరిది కావడం, అతని డిప్యుటేషన్ కొనసాగేందుకు ఆనంద్ పెద్దఎత్తున లాబీయింగ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అమలు కాకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
బల్దియాలో ఎంతోమంది సూపరింటెండెంట్లు, అధికారులు ఉన్నా ఆనంద్‌కే ప్రత్యేక ప్రాధాన్యం ఎందుకని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ఆనంద్ వ్యవహారంపై కమిషనర్ చర్యలు తీసుకుంటారా? లేక రాజకీయ అండతో వ్యవహారం అలాగే కొనసాగుతుందా? అన్నది వేచిచూడాల్సిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img