జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు
కాకతీయ, ఖమ్మం : రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు మొబైల్ ఫింగర్ ప్రింట్ చెక్ ద్వారా సేకరించారు. మద్యం మత్తులో పట్టుబడిన వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. బ్లాక్ స్పాట్లలో బ్యారికేడింగ్, హెచ్చరిక బోర్డులు, సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ కఠిన తనిఖీలు నిర్వహించి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


