సీఏఐ అసోసియేట్ డైరెక్టర్‌గా బొమ్మినేని
కాకతీయ, వరంగల్: కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఏఐ) అసోసియేట్ డైరెక్టర్‌గా తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. సీఏఐ నూతన అధ్యక్షుడిగా వినయ్ ఎన్. కోటక్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, రవీందర్ రెడ్డి ఈ నెల ముంబైలోని అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో అసోసియేట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేశ్ తెలిపారు.ఈ సందర్భంగా అసోసియేషన్ తరఫున బొమ్మినేని రవీందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. సీఏఐ సంస్థకు మరింత గుర్తింపు తీసుకువచ్చేలా ఆయన సేవలు అందించాలని ఆకాంక్షించారు


