గణిత దినోత్సవ ప్రతిభా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
కాకతీయ, నెక్కొండ : తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం (టీఎంఎఫ్) వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నెక్కొండ మండల శాఖ నిర్వహించిన గణిత ప్రతిభా పోటీలు గురువారం నెక్కొండ పాఠశాలలో ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బి.రవికుమార్ ప్రశ్నాపత్రాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ పోటీల్లో టీఎస్‌ఆర్‌ఎస్ పాఠశాలకు చెందిన ఏ. లక్ష్మీ ప్రణతి ప్రథమ బహుమతి సాధించగా, వర్షిత ద్వితీయ, అఖిలా తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. అలాగే జడ్పీ పాఠశాల విభాగంలో అనుజశ్రీ ప్రథమ, ఆర్. సాయి చరణ్ ద్వితీయ, లతీక తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. శ్రీదేవి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణితంలో మరింత ప్రావీణ్యం సాధించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎంఎఫ్ మండల అధ్యక్షుడు టీ. రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్‌రెడ్డి, కోశాధికారి శరత్‌చంద్ర, జిల్లా కౌన్సిలర్ కృష్ణవేణి, గణిత ఉపాధ్యాయులు కిషన్‌రావు, ప్రభాకర్, దివ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.


