మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
కాకతీయ, ఇనుగుర్తి: మండల కేంద్రానికి చెందిన కారం పూరిరామ స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి అయ్యగారిపల్లి గ్రామ సర్పంచ్ మలిశెట్టి శోభన్ ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా 50 కేజీల బియ్యంతో పాటు నగదు సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. బాధిత కుటుంబానికి గ్రామపంచాయతీ తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొనతం జ్యోతి వెంకన్న, మాజీ సర్పంచ్ మామిడి శోభన్ బాబు, మాలోత్ జ్యోతి భద్రు నాయక్, బానోత్ స్వరూప సంధ్య నాయక్, మామిడి భవాని కిరణ్, మామిడి భద్రయ్య, మలిశెట్టి రవి, బొర్ర శ్రీనివాస్, బొల్లు సంపత్ తదితరులు పాల్గొన్నారు.


