శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : వరుస సెలవులతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. రద్దీ దృష్ట్యా ఈనెల 18 వరకు గర్భాలయ,సామూహిక అభిషేకాలు,మల్లన్న స్పర్శ దర్శనం నిలుపుదల చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. రద్దీతో శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల సమమయం పడుతోంది. శనివారం వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి పుణ్యదంపతుల దర్శనం కోసం క్యూలైన్ల, కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. దీంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నది.


