అత్యవసర వేళల్లో ఆపద్బాంధవం 108 సేవలు
ప్రాణరక్షణలో కీలకం – వైద్య నిపుణులు
కాకతీయ, కరీంనగర్ : అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ప్రాణరక్షణగా నిలుస్తున్న 108 అంబులెన్స్ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. అపఘాతాలు, గుండె సమస్యలు, గర్భిణీల ప్రసవాల్లో 108 సేవలు ప్రథమ చికిత్స అందిస్తూ అనేక ప్రాణాలను కాపాడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 16 అంబులెన్సులు, 33 ఈఎంటీలు, 35 పైలెట్లు విధులు నిర్వహిస్తున్నారు. గత 20 నెలల్లో 56,171 మందిని ఆసుపత్రులకు తరలించారు. చలి నేపథ్యంలో గుండె, శ్వాసకోశ సమస్యలు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తూ, అత్యవసరంలో వెంటనే 108కు కాల్ చేయాలని సూచించారు.


