భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న హీరో రోషన్
కాకతీయ, వరంగల్ సిటీ :వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలోని అమ్మవారిని శుక్రవారం సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు, ‘ఛాంపియన్’ చిత్ర ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం దేవస్థాన ఈఓ రామల సునీత హీరో రోషన్‌కు అమ్మవారి పట్టు వస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు ఓరుగంటి పూర్ణచందర్, గాండ్ల స్రవంతి, అనంతుల శ్రీనివాస్, దేవాలయ పర్యవేక్షకులు కాంతి కుమార్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు


