తొర్రూరు హీరో రఘు రామ్ ‘ఓహ్!’కు ఆదరణ
థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శన
దేశవ్యాప్తంగా ప్రముఖ లొకేషన్లలో చిత్రీకరణ
కథ–కథనం–మాటలు రఘు రామ్‌వే
ప్రేక్షకుల ఆశీర్వాదం కోరిన హీరో
కాకతీయ, తొర్రూరు : మన తొర్రూరు హీరో రఘు రామ్ కథానాయకుడిగా నటించిన ‘ఓహ్!’ చిత్రం థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాశ్మీర్, కులు–మనాలి, ఢిల్లీ, తాజ్ మహల్, హైదరాబాద్ వంటి సుందరమైన ప్రదేశాల్లో ఈ సినిమాను చిత్రీకరించడం విశేషం.
ఈ చిత్రంలో శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్లుగా నటించగా, ఏకారి సత్యనారాయణ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. మరో విశేషం ఏమిటంటే తొర్రూరుకు చెందిన హీరో రఘు రామ్ గారే ఈ సినిమాకు కథ, కథనం, మాటలు అందించడం గమనార్హం.
ఈ సందర్భంగా హీరో రఘు రామ్ మాట్లాడుతూ.. తొర్రూరు–వరంగల్ ప్రాంతం నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చి ‘ఓహ్!’ చిత్రంతో హీరోగా, రచయితగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మన ఊరి పేరును తెలుగు సినీ పరిశ్రమలో నిలబెట్టడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేస్తూ, మన ప్రాంతానికి చెందిన కళాకారులకు అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ‘ఓహ్!’ చిత్రాన్ని చూసి ఆదరించి ఆశీర్వదించాలని ప్రేక్షకులను రఘు రామ్ కోరారు.


