డాకోయిట్’ టీజర్ రిలీజ్.. యాక్షన్‌తో దూసుకెళ్లిన అడివి శేష్
కాకతీయ, సినిమా : అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న యాక్షన్–థ్రిల్లర్ మూవీ ‘డాకోయిట్’ టీజర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తొలిసారిగా తెలుగులో నటుడిగా పరిచయం అవుతుండడం విశేషం. టీజర్‌లో అడివి శేష్, మృణాల్ దొంగల పాత్రల్లో కనిపించగా, అనురాగ్ కశ్యప్ విలన్‌గా ఆకట్టుకున్నారు. టీజర్ ఆరంభంలో మృణాల్ తన ప్లాన్‌కు అంగీకరించిందని అడివి శేష్ తన స్నేహితుడితో చెప్పే సీన్ ఆసక్తికరంగా సాగుతుంది. ఆ వెంటనే కథ పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి మారుతుంది. ముఖ్యంగా స్టీరింగ్ పట్టుకుని దూసుకెళ్లే మృణాల్ ఎంట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తర్వాత ఇద్దరూ కలిసి హైస్ట్ మోడ్‌లోకి వెళ్లిన సన్నివేశాలు టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి.
టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో నాగార్జున, రమ్యకృష్ణ, సౌందర్య నటించిన హిట్ మూవీ ‘హలో బ్రదర్’ (1994)లోని “కన్నె పెట్టారో” పాటను రీమిక్స్ చేసి వినిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్ కూడా టీజర్‌లో కనిపించారు. టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. “వాహ్.. ఏం టీజర్ కట్ అన్నా”, “ఇంటెన్స్‌గా ఉంది.. పాప్‌కార్న్ రెడీ”, “నటుడిగా అనురాగ్ కశ్యప్ కంబ్యాక్ అదిరిపోయింది” అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి.
ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటించాల్సి ఉండగా, సృజనాత్మక భేదాభిప్రాయాల కారణంగా ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేశారు.
షానీల్ డియో దర్శకత్వంలో, సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ‘డాకోయిట్’ చిత్రంలో జైన్ మారీ ఖాన్, కమాక్షి భాస్కర్ల కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదట క్రిస్మస్‌కు విడుదల కావాల్సిన ఈ సినిమా, ఇప్పుడు ఉగాది కానుకగా మార్చి 19, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.


