రెండో పెళ్లిపై ప్రగతి స్పష్టత
కాకతీయ, సినిమా : టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెండో పెళ్లిపై వస్తున్న ప్రచారానికి తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె… ‘జీవితంలో ఒక తోడు అవసరమే. కానీ నా మెచ్యూరిటీకి సరిపడే మంచి వ్యక్తి దొరకకపోతే పెళ్లి అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. పెళ్లయ్యాక కట్టుబాట్లు పెడితే భరించలేనని, ప్రస్తుతం పెళ్లిపై ఎలాంటి ఆశలు లేవని తెలిపారు. ఫిట్‌నెస్ విషయంలో రాజీ పడని ప్రగతి, ఇటీవల అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. తన కొడుకు బెంగుళూరులో ఉద్యోగం చేస్తుండగా, కూతురు యూఎస్‌లో చదువుకుంటోందని, పిల్లలపై గర్వంగా ఉందని చెప్పారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


