సమర్థవంతంగా ఎన్నికల విధులు
పోలీసు అధికారులను ప్రశంసించిన సీపీ సన్ ప్రీత్‌సింగ్
కాకతీయ, హన్మకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన గ్రామ పంచాయితీ ఎన్నికలు అధికారుల సమన్వయంతో ప్రశాంతంగా ముగిశాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చెప్పారు, ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా పూర్తి కావడంలో పోలీస్ యంత్రాంగం కీలకపాత్ర పోషించింది. ఎన్నికల ప్రకటన తేదీ నుండి డీసీపీ స్థాయి నుంచి హోంగార్డ్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు సమన్వయంతో విధులు నిర్వర్తించారని, పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఎన్నికల విజయవంతమైన నిర్వహణలో భాగంగా డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, కవితలు సీపీని మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందజెట్టి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఎన్నికల నిర్వహణలో కీలకంగా నిలిచిన అన్ని అధికారులు, సిబ్బంది ప్రతిభ, అంకితభావాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.


