అక్రమ ఇసుక తరలింపు అడ్డుకున్న పోలీసులు
ట్రాక్టర్ స్వాధీనం – డ్రైవర్‌పై కేసు నమోదు
కాకతీయ, కరీంనగర్ : నమ్మదగిన సమాచారం మేరకు తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను ఇతర గ్రామాలకు తరలిస్తున్న ట్రాక్టర్‌ను రేణికుంట సమీపంలో అడ్డుకుని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తమ్మన వేణి శ్రీనివాస్ (29), రేణికుంట గ్రామం, తిమ్మాపూర్ మండలానికి చెందిన వ్యక్తిని ట్రాక్టర్ డ్రైవర్‌గా గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా అక్రమ ఇసుక తరలింపులకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


