- బాలుర కబడ్డీలో తెలంగాణ మోడల్ జూనియర్ కాలేజీ విజయం
కాకతీయ, నెల్లికుదురు: మేరా యువ భారత్ వరంగల్ ఆధ్వర్యంలో నెల్లికుదురు మండల కేంద్రంలో నిర్వహించిన మండల్ బ్లాక్ లెవెల్ క్రీడలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ క్రీడల్లో బాలుర కబడ్డీ విభాగంలో తెలంగాణ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదర్శ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్‌రావు మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మానసిక, శారీరక ధృడత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం పెంపొందించుకున్నప్పుడే జీవితంలో ముందడుగు వేయగలుగుతామని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కొమురయ్య, మేరా యువ భారత్ జిల్లా యూత్ కోఆర్డినేటర్ ధరావత్ రాజేందర్ నాయక్, అధ్యాపకులు కుటుంబరావు, సక్రం రాథోడ్, జ్యోతి, అంజూమ్ సుల్తానా, నవీన్‌కుమార్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.


