మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జినుకల రమేష్
కాకతీయ, నర్సింహులపేట : డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్ సహకారం, నూతనంగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల సమన్వయంతో నర్సింహులపేట మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జినుకల రమేష్ అన్నారు. మంగళవారం మరిపెడ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్ చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తించి మండల పరిధిలోని 17 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి నూతన పాలకవర్గంతో కలిసి సమన్వయంతో పనిచేస్తామని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వేముల జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దస్రు నాయక్, చిర్ర సతీష్, మండల యూత్ అధ్యక్షుడు పొన్నం శ్రీకాంత్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కడుదుల రామకృష్ణ, యాకయ్య, రవి, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


