సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ నియామకం
ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు
కాకతీయ, హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రఖ్యాత ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే వరకు ఆయనే సీఎండీగా కొనసాగుతారని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన శక్తి రంగంలో సింగరేణి ప్రధాన ప్రభుత్వ సంస్థగా ఉన్న నేపథ్యంలో, కృష్ణ భాస్కర్ పూర్తిస్థాయిలో సీఎండీ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం వెల్లడించింది. 2012 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా సమర్థవంతమైన సేవలు అందించారు. ప్రస్తుతం జెన్‌కో సీఎండీగా, డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పరిపాలనలో అనుభవం, క్రమశిక్షణతో పని చేసే అధికారిగా పేరొందిన కృష్ణ భాస్కర్ నియామకం సింగరేణి సంస్థకు మరింత బలం చేకూరుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


