ప్రజల ఆశలను నెరవేర్చాలి
నూతన సర్పంచులకు మంత్రి కొండా సురేఖ సూచన
కాకతీయ, గీసుగొండ : ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి కొండా సురేఖ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాంపురం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన రడం భరత్ కుమార్, మనుగొండ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన పేర్ల శ్రావణ్, సూర్యతండా గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన భానోతు రాఘవేంద్రలను మంత్రి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి విజేతలను అభినందిస్తూ,గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని, ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పారదర్శక పాలన అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


