పంచాయితీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
కాకతీయ, హుజూరాబాద్ : మూడో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు హుజూరాబాద్ మండలంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ డీసీపీ భీమ్‌రావు తెలిపారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసు సిబ్బందికి ఆయన సమగ్ర సూచనలు చేశారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందికి విధులను కేటాయించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వి.సతీష్, హుజూరాబాద్ పట్టణ సీఐ టి.కరుణాకర్ పాల్గొన్నారు. అలాగే బందోబస్తు విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఇన్‌స్పెక్టర్లు పుల్లయ్య, రామచంద్రరావు, సరిలాల్, ప్రదీప్‌కుమార్‌తో పాటు రూట్ ఆఫీసర్లుగా నియమితులైన 12 మంది ఎస్‌ఐలు హాజరయ్యారు. మొత్తం దాదాపు 150 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటూ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.


