పెగడపల్లిలో మహా పడిపూజ
అయ్యప్ప శరణుఘెషతో మారోమోగిన గ్రామం
పరికరాల శ్రీను ఇంటిలో వైభవంగా పూజా వేడుక
కాకతీయ, హన్మకొండ : హన్మకొండ జిల్లా పెగడపెల్లి గ్రామంలో అయ్యప్ప మహా పడిపూజ వేడుక ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన పరికరాల శ్రీను, అనిల్, మహేందర్ గృహంలో జరిగిన పడిపూజ వేడుకలు వందలాది భక్తులు తరలివచ్చారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో పెగడపల్లి మార్మోగింది. ఈ మహపడిపూజ మహోత్స వానికి పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మర ణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. పూజ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కారక్రమంలో పేరం గోపికృష్ణ, చీకటి ఆనంద్, వీరచారి, వివేక్ పాల్గొన్నారు.



