ఆదివాసీల సమస్యలపై విక్రాంత్ భూరియాను కలిసిన శోభన్ బాబు
ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తా
జాతీయ కోఆర్డినేటర్ భుక్య శోభన్‌బాబు
కాకతీయ, ఇనుగుర్తి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలోని అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్‌గా భుక్య శోభన్‌బాబు సోమవారం న్యూఢిల్లీలో అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ విక్రాంత్ భూరియాని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా విక్రాంత్ భూరియా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తున్న ఆదివాసీ సముదాయాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వారి హక్కుల పరిరక్షణ కోసం క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీని ఆదివాసీ ప్రజల మధ్య మరింత బలోపేతం చేయడం కోసం సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.దీనికి ప్రతిస్పందనగా భుక్య శోభన్‌బాబు మాట్లాడుతూ తనపై ఉంచిన విశ్వాసానికి మరియు అప్పగించిన ఈ కీలక బాధ్యతకు పార్టీకి రుణపడి ఉంటానని అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో, బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ, కర్ణాటక రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేసినట్లు తెలిపారు.ఈ భేటీతో అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్ కార్యాచరణ మరింత బలోపేతం కావడం ఖాయమని, ఆదివాసీ సముదాయాల హక్కుల పోరాటానికి కొత్త ఊపును అందించనుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


