పెద్దతండాలో బీఆర్ఎస్ ప్రచార హోరు
బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి బాట : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
కాకతీయ, మహబూబాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కురవి మండలం పెద్దతండాలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం హోరెత్తింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ మీనా నవీన్‌ను కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దతాండ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి బాట బీఆర్ఎస్‌తోనే సాధ్యమని అన్నారు. గతంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నిదర్శనమని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు గుగులోత్ శ్రీరామ్ నాయక్‌తో పాటు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.


