ప్రజా సేవతో మన్ననలు పొందాలి
బీఆర్ఎస్ నేత వద్దిరాజు కిషన్
ముప్పారం గ్రామానికి వాటర్ ప్లాంట్ నిర్మాణానికి హామీ
కాకతీయ, ఇనుగుర్తి: గాయత్రి గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు కిషన్ గ్రామ ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించటం ద్వారా ప్రజా మన్ననలు పొందాలని సూచించారు.
సోమవారం మండలం లోని చిన్న ముప్పారం గ్రామం నుంచి సర్పంచ్‌గా గెలుపొందిన రాయలి భవాని శేఖర్ దంపతులు మరియు వార్డు సభ్యులు కిషన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కిషన్ సర్పంచి దంపతులు, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు. గ్రామానికి వాటర్ ప్లాంట్ అవసరమని గ్రామస్తులు కోరగా, కిషన్ వెంటనే స్పందించి, అవసరమైన నగదును అందించి ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మకంతో అభ్యర్థులను గెలిపించారని, ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ గుండా వెంకన్న, ఉపసర్పంచ్ మల్లం ఐలయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకులు వార్డు సభ్యులు కారు పోతుల సుమన్, నాయకులు గంగాధర్, ఆది చందు, నామాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.


