గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ నిషేధాజ్ఞలు
ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు
: పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్–163 కింద నిషేధాజ్ఞలు అమలులోకి వచ్చాయి. డిసెంబర్ 17న జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వి. సైదాపూర్ మండలాల్లో ఐదుగురికి మించి గుమికూడటం, సమావేశాలు నిర్వహించడం నిషేధం. ఈ ఆదేశాలు డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల నుంచి 17 రాత్రి 11.59 గంటల వరకు అమల్లో ఉంటాయి. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కమిషనర్, ఎన్నికలు శాంతియుతంగా జరగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.


