epaper
Monday, March 2, 2026
epaper

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య
ట్రాక్టర్‌తో ఢీకొట్టి మట్టుబెట్టిన భార్య–ప్రియుడు

కాక‌తీయ‌, వికారాబాద్ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన సంచలన ఘటన వికారాబాద్ జిల్లా చోడాపూర్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. ఈ కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గ్రామానికి చెందిన కర్రె రత్నయ్య (32) తన భార్య కవిత, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడితో కలిసి నివసిస్తూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కవిత ప్రైవేట్ కంపెనీలో కూలీగా పని చేస్తోంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణతో కవితకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రత్నయ్య పెళ్లీడుకొచ్చిన కూతుర్లు ఉన్నారని, కుటుంబ గౌరవాన్ని కాపాడాలని భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయితే ఇవే హెచ్చరికలు తమ అక్రమ సంబంధానికి అడ్డుగా మారుతున్నాయని భావించిన కవిత, ప్రియుడు రామకృష్ణతో కలిసి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్లాన్ ప్రకారం, రత్నయ్య ఎప్పటిలాగే పొలం పనుల కోసం వెళ్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్‌తో ఢీకొట్టి రామకృష్ణ అతడిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కవిత పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చింది. అయితే రత్నయ్య తమ్ముడు దేవయ్య అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, భార్య–ప్రియుడు కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో కవిత, రామకృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదంతో పాటు కలకలం రేపింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

మానుకోటలో దొంగ బంగారం దందా?

మానుకోటలో దొంగ బంగారం దందా? నకిలీ బంగారంతో వినియోగదారులకు కుచ్చుటోపి ఇతర రాష్ట్రాల చోరీ...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img