19న తెలంగాణ భవన్‌కు కేసీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యవర్గ సభ్యులతో సంయుక్త సమావేశం
కాకతీయ, హైదరాబాద్ : ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యవర్గ సభ్యులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో కృష్ణా, గోదావరి నదుల జలాలపై బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణిని కేంద్రీకరించి చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్తితులు, పంచాయతీ, అభివృద్ధి ప్రాజెక్టుల అమలు, పార్టీ వ్యూహాలపై కూడా సమగ్రంగా చర్చ జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


