ఓటమిని తట్టుకోలేక మృతి
గుండెపోటుతో బీఆర్ఎస్ అభ్యర్థి మృతి
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టపురం గ్రామంలో విషాదం
కాకతీయ, నల్గొండ : ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి గుండె పోటుతో మృతి చెందాడు. ఈసంఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టపురం గ్రామంలో జరిగింది. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెన్నగొని కాటంరాజు ఓటమి పాలయ్యారు. ఓటమి చెందిన నాటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న కాటంరాజు పదేపదే అదే విషయంపై ఆలోచిస్తూ మదనపడ్డాడు. ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. కాటంరాజు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.


