కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలి
సీఐటీయూ నాయకుల డిమాండ్
కాకతీయ, రామకృష్ణాపూర్ : సింగరేణి సంస్థ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుబారాగా ఖర్చు చేస్తూ కార్మికుల సొంతింటి కలను నెరవేర్చడం లేదని సిఐటియూ నాయకులు ఆరోపించారు. ఆదివారం స్థానిక సిఐటియూ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రాంచ్ అధ్యక్షుడు వెంకటస్వామి, కార్యదర్శి రాజేందర్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి నుంచి డివిడెండ్లు తీసుకోవడానికే పరిమితమై సంస్థ భవిష్యత్తుపై నిర్లక్ష్యం చూపుతున్నాయని విమర్శించారు. కార్మికుల సొంతింటి పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జనవరి 18న నిర్వహించనున్న సిఐటియూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు రామస్వామి, వెంకటేష్, ప్రవీణ్, శ్రీకాంత్, శ్రీధర్, సురేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


