epaper
Monday, March 2, 2026
epaper

కాంగ్రెస్‌పై బీసీల ఆగ్ర‌హం

కాంగ్రెస్‌పై బీసీల ఆగ్ర‌హం
42 శాతం రిజర్వేషన్ అమలు ఎక్క‌డ‌?
రెండేళ్ల నుంచి కాలయాపన చేస్తున్న ప్ర‌భుత్వం
రాజ్యసభ స‌భ్యుడు వద్దిరాజు రవిచంద్ర

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బీసీలు అవమానానికి గురయ్యారని రాజ్యసభ స‌భ్యుడు, బీఆర్‌ఎస్‌ నాయకులు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి కాలయాపన చేస్తూ బీసీలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు కోసం ఢిల్లీలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీ లీడర్లతో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా పేరుతో డ్రామా చేశారని వద్దిరాజు విమర్శించారు. ఈ ధర్నాలో రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్ట బద్ధత అమలు కాదని తేల్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని అప్పుడే అర్థమైందని అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని జీవో తెచ్చి మరో మోసానికి తెరలేపారని విమర్శించారు. బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని కేటీఆర్, హరీశ్‌ రావు అనేక సార్లు డిమాండ్ చేస్తే, ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు.

బీసీ బిడ్డ ఈశ్వరాచారి ఆత్మహత్య

కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్యం కారణంగా నాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. నేడు బీసీలకు ఇస్తామన్న హామీలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుంటే బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగానికి పాల్పడిన అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్‌ విజయం సాధించిందని తెలిపారు. కుల గణన పూర్తిగా ఆశాస్త్రీయమని, కుల గణన పేరుతో BC లను తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. మధ్య ప్రదేశ్‌లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఎలా సాధ్యం అయిందో వెళ్ళి చూస్తే అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై బీసీలు చాలా ఆగ్రహంతో ఉన్నారని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. రెండో విడత, మూడో విడత సర్పంచ్‌ ఎన్నికల్లో బీసీలందరూ కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ఢిల్లీ వెళ్లి మోదీ, రాహుల్‌ గాంధీని కలిసేందుకు రేవంత్‌ రెడ్డికి టైమ్‌ ఉంటుందని.. అలాంటప్పుడు బీసీలకు ఇచ్చిన హామీలపై వారితో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని బిహార్‌ ఎన్నికల సందర్భంగా అబద్ధాలు చెప్పారని తెలిపారు. అబద్ధాలు చెప్పినందుకు కాంగ్రెస్‌ పార్టీకి బిహార్‌ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.

చ‌ర్చ‌కు డిమాండ్ చేయాలి

అనేక పథకాలను పెట్టి బీసీలను కేసీఆర్ ఆదుకున్నారని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాంగ్రెస్ మోసాలను బీసీలు గమనిస్తున్నారని.. బీసీ జ్వాలలో కాంగ్రెస్ పార్టీ మసైపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్లమెంట్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఇండి కూటమి ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఒక్కసారైనా మాట్లాడలేదని అన్నారు. బీసీ బిడ్డగా తాను ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టానని గుర్తుచేశారు. ఈ బిల్లుకు అన్ని పార్టీల మద్దతును కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉందని తెలిపారు. ఆనాడు కేసీఆర్ బీసీలకు 33 శాతం రిజర్వేషన్ పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉందని అన్నారు. కానీ బీసీలను కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదు కాబట్టే.. లోక్‌సభ, రాజ్యసభలో చర్చకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ డిమాండ్‌ చేయలేదని తెలిపారు. పార్లమెంట్‌లో కేవలం ఓటు చోర్‌, సర్ పై చర్చకు పట్టుబట్టడం కాదు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై చర్చకు డిమాండ్‌ చేయాలన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img