ధాన్యం బస్తాలు కాలిన బాధితునికి చేయూత
కాకతీయ, గణపురం : మండల కేంద్రానికి చెందిన బండి. కుమారస్వామి గౌడ్ అనే రైతు ధాన్యం బస్తాలు ప్రమాదవశాత్తు కాలిపోగా బాధిత కుటుంబానికి శుక్రవారం మాజీ జడ్పీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో రూ.20 వేల సాయం అందజేశారు. పంట పొలాల్లో వరిగడ్డి ని కొందరు దగ్ధం చేస్తున్న క్రమంలో మంటలు వ్యాపించి ధాన్యం బస్తాలు దగ్ధమైనట్లు కుమారస్వామి విలపిస్తూ తెలిపారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ అనుకోకుండా జరిగిన సంఘటనలో రైతు పూర్తిగా నష్టపోయాడని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని బాధితునికీ అండగా ఉండాలన్నారు. తన వంతుగా బాధిత రైతుకు చిన్న సహాయం చేశానన్నారు. అనంతరం కొత్తపల్లి గ్రామానికి చెందిన షరీఫ్ అనే యువకునికి 12 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ రామకృష్ణ. మార్క మొగిలి. మామిండ్ల మల్లేష్. మాదాసు రవి. మార్క కుమార్. సాయి. ప్రశాంత్. తదితరులు


