సేవే లక్ష్యంగా జీవించిన ఎంబాడి రవీందర్
పెరిక కుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు అల్లం రాజేశ్ వర్మ
కాకతీయ, ఖిలావరంగల్ : పెరిక కుల ముద్దు బిడ్డ, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్, ప్రజా నాయకుడు కీర్తిశేషులు ఎంబాడి రవీందర్ సేవలు చిరస్మరణీయమని తెలంగాణ పెరిక కుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు అల్లం రాజేశ్ వర్మ అన్నారు. ఎంబాడి రవీందర్ జయంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లం రాజేశ్ వర్మ మాట్లాడుతూ పెరిక కులం అభ్యున్నతికి ఎంబాడి రవీందర్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేసుకున్నారు. ఎంబాడి రవీందర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న వారి కుటుంబానికి పెరిక కుల సంఘం తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంబాడి అమరేందర్, బెడిద వీరన్న, బేల రమేశ్, సుంచు వీరన్న, ఏసిరెడ్డి ప్రభాకర్, అంకతి అభిలాష్, అచ్చ లక్ష్మణ్, ఇట్నేని శశిధర్, బేల కర్ణాకర్, నాగేందర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.


