రెండవ సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధం
కాకతీయ, గీసుగొండ : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. గ్రామపంచాయతీ రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా సర్పంచులు,వార్డ్ మెంబర్ల ఎన్నికల కోసం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో శుక్రవారం ఎన్నికల సామాగ్రి పంపిణీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో అన్ని పోలింగ్ అధికారులకు,ఉప పోలింగ్ అధికారులకు అవసరమైన సామాగ్రిని అందజేశారు.ఈ సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఆర్డీఓ పర్యవేక్షణలో ఎంపీడీఓ,తహసిల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.


