నాగారం సర్పంచ్‌గా మమతను గెలిపించండి
ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలి
గెలిచినా ఓడినా.. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటా
నాగారం గ్రామ ఎన్నికల ప్రచారంలో ప్రణవ్
కాకతీయ, జమ్మికుంట / హుజురాబాద్ : విద్యావంతురాలు మమతను నాగారం గ్రామ సర్పంచుగా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం నాగారం గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ప్రదీప్ మమతను గెలిపించాలని కోరుతూ ప్రణవ్ ప్రచారం చేశారు. మందుగా గ్రామంలోనీ అంజన్న స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రణవ్.. అనంతరం గ్రామస్థులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈసందర్భంగా నాగారం గ్రామంలో పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు. గెలిచినా, ఓడినా ప్రజల మధ్య ఉంటూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తున్నానని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈశాన్యంగా ఉన్న ఈ ప్రాంతం, ఇక్కడి ఆంజనేయ స్వామి అత్యంత మహిమ కలిగినదని, స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి మరిన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల, గ్రామ శాఖ నాయకులు పాల్గొన్నారు.


